Telugu Vedic Astrology Horoscope Rasiphalalu Services

శ్రీ విళంబి నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలితాలు 2018 - 2019

2018 - 2019 Sree Vilambi Nama Samvatsara Midhuna Rasi Phalitalu / Gemini Sign Predictions

Sri Vilambi Midhuna Rasi Phalalu 2018 2019
  • మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములలో జన్మించిన వారు మిధున రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధునరాశి వారికి ఆదాయం - 14 వ్యయం - 02 రాజపూజ్యం - 04 అవమానం - 03

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారు కొద్దిపాటి అసంతృప్తిని ఎదుర్కొందురు. ఆశించిన విజయాలు పూర్తిగా నెరవేరుట కష్టం. ధనాదాయంలో హెచ్చుతగ్గులు ఏర్పడుచుండును. మీ మీ సొంత జాతకంలోని గ్రహ బలాలపై ఈ సంవత్సరం ఆదాయం ఆధారపడును. ధనవ్యయం అధికమగును. సంవత్సరం మధ్య భాగం నుండి కొంత అనుకూలత ప్రారంభం అగును. చేపట్టిన నూతన పనులు లాభించును. దూర ప్రాంత నివాస ప్రయత్నాలు, ఉద్యోగ అన్వేషణ ఫలించును. వివాహ ప్రయత్నములు ఈ సంవత్సరం కష్టం మీద ఫలించును. ఉద్యోగ జీవులకు సామాన్య ఫలితాలు. వ్యాపార రంగంలోని వారికి అంత అనుకూలత లేదు. పోటీదారులు పెరుగును. యువకులకు వాహన సంబంధ ప్రమాదాలు లేదా సమస్యలు. జాగ్రత్త అవసరం. పెద్ద వయస్సు వారికి మూత్ర సంబంధ సమస్యలు, ధన వ్యయ సూచన. కళారంగంలోనివారికి మంచి గుర్తింపు. వైద్య రంగంలోనివారికి అనుకూలమైన కాలం. వ్యవసాయ దారులకు మిశ్రమ పంటలు కలసి వచ్చును. విద్యార్థులకు జయం.

మిధున రాశి వారు శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా కొద్దిపాటి అనుకూలమైన ఫలితాలనే పొందుదురు. భూ సంబంధ లేదా గృహ సంబంధ వ్యాపారములు చేయువారికి విశేష లాభం. సంతాన ప్రయత్నములు చేయువారికి చక్కటి పుత్ర సంతాన సూచన. 11-అక్టోబర్-2018 తదుపరి జీవిత భాగస్వామికి మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారు శని గ్రహం వలన వైవాహిక జీవనంలో అపసవ్యతలు ఎదుర్కొనుటకు సూచనలు అధికం. జీవిత భాగస్వామితో తగాదాలు లేదా అవిధేయత ఏర్పడును. పునర్భూ వివాహ ప్రయత్నాలు మాత్రం చక్కగా ఫలించును. ప్రేమ వ్యవహారములలో ఉన్నవారు కష్టాలు ఎదుర్కొండురు. ఆర్థికంగా శని పెద్దగ ఇబ్బందులు కలుగచేయడు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారికి రాహువు కలసిరాడు. ఆర్థిక సమస్యలు, ఋణములు కలుగచేయును. ఆరోగ్య భంగములు, ప్రమాదాలు ఏర్పరచును. కేతువు ఈ రాశి వారికి పూర్వీకుల సంబంధమైన స్థిరాస్తిని పొందుటకు సహకరించును.

Pages you may like to visit:

రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us

Connect on WhatsApp

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.